'శ్రీదేవి బంగాళా' టీజర్

Article
సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా వారియర్ కొత్త సినిమా 'శ్రీదేవి బంగాళా' టీజర్ ఈమధ్యే రిలీజ్ అయింది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ టీజర్లో సీన్లు అతిలోక సుందరి శ్రీదేవి జీవితాన్ని పోలి ఉండడం తో వివాదాస్పదం అయ్యాయి. టీజర్లలో ప్రియా వారియర్ పాత్రను ఫిలిం స్టార్ శ్రీదేవిగా చూపించారు. ఒంటరితనంతో బాధపడే సూపర్ స్టార్ శ్రీదేవిగా ప్రియా నటించింది. కాకపొతే టైటిల్ లో శ్రీదేవి పేరు ఉండడం..పైగా టీజర్ చివర్లో బాత్ టబ్ లో పడిపోయి ప్రియా చనిపోయినట్టుగా చూపించడంతో ఇది నిజం శ్రీదేవి జీవితాన్ని పోలి ఉందని.. పబ్లిసిటీ కోసం ఇలా చేశారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా టీజర్ ను చూసి అప్సెట్ అయిన బోనీ కపూర్ 'శ్రీదేవి బంగాళా' టీమ్ కు లీగల్ నోటీసులు పంపించారు. 'శ్రీదేవి బంగళా' దర్శకుడు ప్రశాంత్ ఈ విషయంపై స్పందిస్తూ లీగల్ నోటీసులను అందుకున్న విషయం నిజమేనని ధృవీకరించాడు. లీగల్ గా దానికి సమాధానం ఇస్తామని ప్రకటించాడు. శ్రీదేవి అనేది ఒక కామన్ పేరు అని.. తమ సినిమాలో హీరోయిన్ పేరు శ్రీదేవి అని చెప్పుకొచ్చాడు. ప్రియా వారియర్ ఈ 'శ్రీదేవి బంగాళా' సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ వివాదాలు ఈ సినిమాకు ఏ విధంగా హెల్ప్ అవుతాయో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ప్రియా వారియర్ నటించిన డెబ్యూ ఫిలిం 'ఒరు ఆదార్ లవ్' సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగులో 'లవర్స్ డే' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. మరి ఆలోపు ఈ 'శ్రీదేవి బంగాళా' ఎందుకు వివాదాస్పదం అయిందో టీజర్ చూసి మీరే తేల్చండి
Prev మహానాయకుడు భారీ విజయం సాధిస్తుందా?
Next ‘కాంచన-3’ రివ్యూ అండ్ రేటింగ్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.