'ఉగాది' కానుకగా 'మహర్షి' నుంచి టీజర్

Article
మహేశ్ కథానాయకుడిగా 'మహర్షి' సినిమా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి వుంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక 'ఉగాది' కానుకగా ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ విడుద‌ల చేయాల‌నే ఆలోచనలో వున్నారు. దిల్ రాజు .. అశ్వనీదత్ .. పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి , దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. దేవిశ్రీ సంగీతం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు కనిపించనుండటంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Prev లక్ష్మీస్‌ ఎన్టీఆర్ లో కీలకమైన వైస్రాయ్‌ హోటల్‌ సీన్‌...
Next వరుసగా 14 హిట్లు కొట్టిన బాలీవుడ్ హీరో
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.