'చిత్రలహరి' టీమ్ కి ధన్యవాదాలు తెలిపిన సాయిధరమ్ తేజ్

Article

సాయిధరమ్ తేజ్ కి వరుసగా అరడజను పరాజయాలు ఎదురుకాగానే, ఆయన ఆలోచనలో పడ్డాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఈ కాంబినేషన్లో 'చిత్రలహరి' సెట్స్ పైకి వెళ్లింది. కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఇదే విషయాన్ని సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయడం ఓ మరిచిపోలేని అనుభవమని అన్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల టీమ్ కి .. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ టీమ్ కి.. సినిమాటోగ్రఫర్ కార్తీక్ టీమ్ కి ఆయన ధన్యవాదాలు తెలియజేశాడు. షూటింగు అయిపోయిన సందర్భంగా ఈ సినిమా టీమ్ తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

Prev సైనా బ‌యోపిక్ నుండి శ్ర‌ద్ధా క‌పూర్ ఔట్‌!
Next తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.