రాజేంద్ర‌ప్రసాద్‌గారితో క‌లిసి పనిచేయ‌డం ఆనందంగా ఉంది:విక్టరీ వెంకటేశ్‌

Article

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్‌ 2'. 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ట్యాగ్‌ లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకీ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

విక్టరీ వెంకటేశ్ మాటల్లోనే... " ఈ సంక్రాంతి పండుగ‌కి ఎఫ్ 2 రావ‌డం చాలా ఆనందంగా ఉంది. సాధార‌ణంగా పండ‌గ‌ల‌కు వ‌చ్చే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ఈ సంక్రాంతికి ఎఫ్‌2.. సంక్రాంతి అల్లుళ్లుగా వ‌స్తున్నాం. నేను పెద్దహీరోలాగా ఎప్పుడూ అనుకోను. క‌థ‌, ద‌ర్శ‌కుడిని న‌మ్మి సినిమా చేశాను. అనిల్‌తో ఏది బావుంది.. బాలేదు అని డిస్క‌స్ చేశాను. అలాగే దిల్‌రాజుతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు నేను ప‌నిచేస్తుంటే కో ప్రొడ్యూస‌ర్‌, మేనేజ‌ర్‌లా క‌లిసిపోయి ప‌నిచేశాను. దృశ్యం, గురు సినిమాలా త‌ర్వాత చేసిన సినిమా ఇది. ఓ ర‌క‌మైన ఎన‌ర్జీని ఉండ‌టం నాకే తెలిసింది. చాలా నేచుర‌ల్‌గా చేశాను. అనీల్ కూడా చాలా ఫ్రీ డ‌మ్ ఇచ్చి చేయించుకున్నాడు. వ‌రుణ్‌తేజ్‌, రాజేంద్ర‌ప్రసాద్‌గారితో క‌లిసి పనిచేయ‌డం ఆనందంగా అనిపించింది. త‌మ‌న్నా, మెహ‌రీన్ వండ‌ర్ వ‌ర్క్ చేశారు" అని వెంకటేశ్ చెప్పారు. ఈ సినిమాకు ప‌నిచేసిన స‌మీర్‌రెడ్డి, దేవిశ్రీ ప్ర‌సాద్‌ల‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Prev డ్రాప్ అయిన కథానాయకుడు కలెక్షన్స్
Next ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.