‘విన‌య విధేయ రామ’ తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

Article

పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు కళ్ళన్నీ తొలి రోజు వసూళ్ల‌పైనే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా వినయ విధేయ రామ‌ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తితోనే ఉన్నారు. అయితే 24 గంటల ముందు కనిపించిన ఆసక్తి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. రామ్ చరణ్ సినిమా వచ్చిన తర్వాత కచ్చితంగా తొలిరోజు రికార్డులన్నీ బద్దలైపోతాయని చాలావరకు నమ్మారు ఫ్యాన్స్. అయితే ఎవరూ ఊహించని విధంగా బెనిఫిట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం.

దాంతో వసూళ్లు ఎలా ఉంటాయనే కంగారు ఇప్పుడు అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లలో కూడా కనిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం తొలిరోజు వ‌సూళ్లు కేవ‌లం 13 కోట్ల షేర్ వ‌ర‌కు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. రంగ‌స్థ‌లం సినిమాకు 20 కోట్ల వ‌ర‌కు అందుకున్నాడు చ‌ర‌ణ్. కానీ ఇప్పుడు సంక్రాంతి సీజ‌న్ లో వ‌చ్చి కూడా త‌క్కువ వ‌సూళ్లు అందుకుంటున్నాడు చ‌ర‌ణ్. కనీసం ఒక్కసారి కూడా సినిమా చూడలేం అనేంతగా టాక్ బయటకు వెళ్లి పోవడంతో వినయ విధేయ రామ‌ పరిస్థితి ఎలా ఉండబోతుందో అని భయం అందరిలోనూ ఉందిప్పుడు. ముఖ్యంగా ఈ సినిమా సేఫ్ కావాలంటే 95 కోట్ల కావాలి.

రంగస్థలం సినిమా కు 125 కోట్ల షేర్ రావడంతో అదే నమ్మకం ఉంచి ఇప్పుడు వినయ విధేయ రామ‌ సినిమాను భారీ రేట్ల‌కు కొన్నారు బ‌య్య‌ర్లు. కానీ ఈ సినిమా చూస్తుంటే కనీసం 50 కోట్ల మార్కును అందుకుంటుందా అనేది అనుమానంగా మారింది. ఇదేగాని జరిగితే గతేడాది అజ్ఞాతవాసి మిగిల్చిన చేదు జ్ఞాపకం కంటే కూడా ఇప్పుడు అబ్బాయి మరింత ఎక్కువ చేదు జ్ఞాప‌కం తీసుకురావడం ఖాయం. మరి ఈ టాక్ తో విన‌య విధేయ రామ ఎంత‌వ‌ర‌కు వ‌సూలు చేస్తుంద‌నేది చూడాలిక‌.

Prev సల్మాన్ ఖాన్ సేఫ్ గేమ్..మరోసారి పాత ఫార్ములానే నమ్ముకున్నఖాన్
Next ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.