వినయ విధేయ రామ రివ్యూ

Article
  • చిత్రం: వినయ విధేయ రామ
  • నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు
  • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
  • నిర్మాత: డీవీవీ దానయ్య
  • దర్శకత్వం: బోయపాటి శ్రీను
  • సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
రేటింగ్‌: 2.5/5

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన కథల్లో కొండంత హీరోయిజం కనిపిస్తుంటుంది. కథానాయకుడ్ని ప్రేమించి, అభిమానుల్లో ఓ అభిమానిగా మారిపోయి సినిమాలు తీస్తుంటారాయన. అందుకే అవన్నీ వాణిజ్యపరంగా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకుంటాయి. ఇప్పుడు రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించారు. మరి బోయపాటి మాస్‌ హీరోగా చెర్రీ ఎలా కనిపించారు. సాఫ్ట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ మాస్‌ సినిమా ఎలా ఉంది? ప్రతి నాయకుడిగా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ఏవిధంగా మెప్పించారు?

క‌థ‌: న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా ప్రమాదం ఏర్ప‌డుతుంది. వారు చనిపోతామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఓ చిన్న‌పిల్లాడు ఏడుపు విన‌ప‌డుతుంది. ఆ ఏడుపు విన్న‌వారికి చ‌నిపోవాలనే ఆలోచ‌న పోయి.. బ్ర‌త‌కాల‌నుకుంటారు. త‌మ‌కు దొరికిన పిల్ల‌వాడికి రామ్ అనే పేరు పెడ‌తారు. అలా న‌లుగురు కాస్త ఐదుగురు అవుతారు. అన్న‌ల కోసం రామ్ త‌న చ‌దువు మానుకుని వారి చ‌దువు కోసం పాటు పడ‌తాడు. క్ర‌మంగా రామ్ స‌హా అంద‌రూ పెరిగి పెద్ద‌వుతారు. రామ్‌(రాంచ‌ర‌ణ్‌)కు దూకుడు ఎక్కువ‌. ఎక్క‌డ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటాడోన‌ని అత‌ని పెద్దన్న భువ‌న్ కుమార్(ప్ర‌శాంత్‌) .. ఎవ‌రితో గొడ‌వ ప‌డొద్దు అంటూ మాట తీసుకుంటాడు. వైజాగ్‌లోని రామ్ అన్న‌య్య బై ఎలక్ష‌న్స్‌లో పందెం ప‌రుశురాం(ముఖేష్ రుషి) బావ మ‌రిది బ‌ల్లెం బ‌ల‌రాం(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎదురు నిలిచి ఎల‌క్ష‌న్స్ సజావుగా సాగేలా చూస్తాడు. భువ‌న్‌కు ఎదురు వవ్చిన ప‌రుశురాం మ‌నుషుల‌ను రామ్ చిత‌గ్గొడ‌తాడు. ప‌గ‌బ‌ట్టిన ప‌రుశురాం ఎస్పీ స‌హ‌కారంతో అంద‌ర‌నీ ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకుంటాడు. అక్క‌డ‌కు రామ్ కూడా వ‌స్తాడు. అయితే అనుకోకుండా బీహ‌ర్ నుండి వ‌చ్చిన రాజుభాయ్‌(వివేక్ ఒబెరాయ్ ) మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌ని చూస్తే.. రామ్ అంద‌రినీ చంపేస్తాడు. బీహార్ ముఖ్య‌మంత్రి(మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్‌.పి రామ్ బ్యాగ్రౌండ్‌కు భ‌య‌ప‌డి పారిపోతాడు. ఇంత‌కు రామ్‌ను క‌ల‌వ‌డానికి బీహార్ ముఖ్య‌మంత్రి ఎందుకు వ‌స్తాడు? రాజు భాయ్‌కి, రామ్‌కు ఉన్న విరోధం ఏంటి? అస‌లు రాజుభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది? రామ్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

న‌టీన‌టులు : ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత పక్కా మాస్‌ కమర్షియల్ సినిమాలో నటించిన రామ్‌ చరణ్‌, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టుగా అనిపించినా.. రామ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగానూ మంచి పరిణతి కనిపించింది. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో చరణ్‌ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో ఆమె నటన బాగుంది. విలన్‌గా వివేక్‌ ఒబెరాయ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి, హరీష్ ఉత్తమన్‌, రవి వర్మ, మధునందన్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు.

    ప్ల‌స్ పాయింట్స్‌:
  • - రామ్‌చ‌ర‌ణ్
  • - నిర్మాణ విలువ‌లు
  • - ఇంట‌ర్వెల్ ఏపిసోడ్‌
  • - యాక్ష‌న్
    మైనస్‌ పాయింట్స్‌ :
  • -మితిమీరిన హింస
  • -ఫోర్స్‌డ్‌ సీన్స్‌
  • -సంగీతం
  • -దర్శకత్వం
Prev నా వివాహం గురించి తప్పుడు ప్రచారం చెయ్యకండి : విశాల్
Next మిస్టర్‌ మజ్ను ప్రీ రిలీజ్‌ కు చీఫ్ గెస్ట్ గా Jr.ఎన్టీఆర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.