దర్శకుడు రాధాకృష్ణ కథ వినిపించినప్పుడు నాకు మతిపోయింది: పూజా హెగ్డే

Article

పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల జోడీగా ఛాన్సులు పట్టేసింది. ఎన్టీఆర్ సరసన ఆమె చేసిన 'అరవింద సమేత' భారీవిజయాన్ని అందుకోగా, మహేశ్ బాబుతో చేస్తోన్న 'మహర్షి' ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత సినిమాను ఆమె ప్రభాస్ తో చేస్తోంది. ఒక వైపున సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చేస్తూనే, మరో వైపున దర్శకుడు రాధాకృష్ణతో సినిమాను కూడా ప్రభాస్ మొదలెట్టేశాడు.

ఈ సినిమాలోనే ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం ఇటలీలో జరిగిన ఒక ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆల్రెడీ ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాను గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ .. "దర్శకుడు రాధాకృష్ణ ఈ కథ వినిపించినప్పుడు నాకు మతిపోయింది .. అంతటి అద్భుతమైన కథ ఇది. ఈ తరహా స్క్రిప్ట్ ను వినడం కూడా నాకు ఇదే మొదటిసారి. ఇందులో నా పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ తరహా పాత్ర చేయడం నిజంగా ఒక సవాలే" అంటూ చెప్పుకొచ్చింది.

Prev కల్యాణ్ రామ్ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
Next బాలీవుడ్‌లో తెలుగు దర్శకుల వార్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.