'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' మూవీ రివ్యూ

Article
 • రేటింగ్: 2.0/5
 • స్టార్ క్యాస్ట్: రాయ్‌ లక్ష్మీ, రామ్‌ కార్తీక్‌, పూజితా పొన్నాడ
 • సినిమా దర్శకుడు: కిశోర్‌ కుమార్
 • ప్రస్తుతం హర్రర్ కామెడీ చిత్రాలను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడుతుండడం తో దర్శక , నిర్మాతలు అదే తరహాలో కథలను రాసుకొని తక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం `వేర్ ఈజ్ ది వెంక‌టల‌క్ష్మీ`.

  గురునాథ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.బి.టి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో కిషోర్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.శ్రీధ‌ర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్స్‌గా నటించారు.ఇక ఈ సినిమా విషయానికి వస్తే..బెల్లంపల్లి ఊరికి స్కూల్‌ టీజర్‌గా వెంకటలక్ష్మి( రాయ్ లక్ష్మీ) వస్తుంది. ఆమె అందానికి ఫిదా అయినా చంటి, పండు (ప్రవీణ్‌,మధు నందన్‌) ఆమెను ఇష్టపడతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెంకటలక్ష్మీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే సరికి వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని తెలుస్తుంది. కానీ ఆ దెయ్యం కేవలం చంటి, పండులకే మాత్రమే కనిపిస్తుంది..ఇంతకీ ఆ దెయ్యం ఎవరు..? దెయ్యానికి..వెంకటలక్ష్మీ కి సంబంధం ఏంటి..? అనేది అసలు స్టోరీ.

  సినిమాలో నటించిన నటి నటులంతా వారి పరిధిమేరకు బాగానే నటించారు. డైరెక్టర్ కిషోర్ కామెడీ హారర్‌గా తెరకెక్కించినట్లు చెప్పినప్పటికీ కామెడీ, హారర్‌ రెండూ వర్క్‌ అవుట్ కాలేదు. ఎక్కువగా అడల్ట్‌ కామెడీ మీద దృష్టి పెట్టి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా..సెకండ్ హాఫ్ బాగా సాగతీసినట్లు అనిపించింది.

  Prev RRR నటి డైసీ ఎడ్గార్ లేటెస్ట్ ఫొటోస్
  Next తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
   

  0 Comments

  Write a comment ...
  Post comment
  Cancel
   Please submit your comments.