చంద్రబాబునాయుడుకి కష్టాలు మొదలయ్యాయా?

Article
సుజనా చౌదరి పేరు తెలియని వాళ్ళు ఎవరూ వుండరు. చంద్రబాబు నాయుడు కిచెన్ కేబినెట్లో అత్యంత ముఖ్యుడుగా అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు బినామీలుగా ప్రజలు చెప్పుకునే వాళ్లలో ప్రథముడు. మిగతా వాళ్ళు సీఎం రమేష్ , నారాయణ, ఇంకొంతమంది రాజకీయేతరులు వున్నారని అందరు అనుకుంటుంటారు. నిజం ఏమిటో ఆ దేవుడికే ( వుంటే) తెలియాలి. ఈ రోజు వార్తల్లో సుజనాచౌదరి ఆర్ధిక కుంభకోణం గురించి వచ్చింది. 225 కోట్ల రూపాయలు జీఎస్టీ పన్ను సుజనా గ్రూప్ కంపెనీలు కొల్లగొట్టాయని వెల్లడయ్యింది. ఈ విషయం ఇంతకుముందే తెలిసి అధికారులు అరెస్ట్ చేయటానికి సిద్దమయితే కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. దానిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇది తీవ్ర నేరంగా పరిగణించింది. సాధారణంగా పన్ను ఎగవేతపై ఆరోపణలుంటాయి. కానీ సుజనా గ్రూప్ కంపెనీలు ఎగవేయటంకన్నా పెద్ద నేరమే చేసినట్లు పరిగణించింది. సరుకులు కొన్నట్లుగా చూపించి 225 కోట్లరూపాయలు ప్రభుత్వం నుంచి తెచ్చుకోవటం మాములు పన్ను ఎగవేయటం కన్నా పెద్దనేరమని చెప్పింది. దానికి భాద్యుల్ని అరెస్ట్ చేసే అధికారం ఉందని తేల్చిచెప్పింది. అంటే జీఎస్టీ అధికారులు సుజనా గ్రూప్ అధికారుల్ని జైలుకి పంపించటమే తరువాయి. ఇదేమి సుజనా చౌదరి కంపెనీలకు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు మారిషస్ బ్యాంకుకి అప్పు ఎగవేత కేసులో నానా తంటాలుపడి బెయిలు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు చంద్రబాబునాయుడు దీన్ని ఎలా ప్రజలకు చెబుతాడో చూడాలి. ఇంతకుముందు ఆదాయపన్ను అధికారులు దాడికి వస్తే కావాలని రాజకీయ కక్ష తో తన అనుచరులను వేధిస్తున్నారని దుమ్మెత్తి పోయటం చూసాము. మరి దీన్ని రాజకీయ కక్ష అనే చెబుతాడా? 225 కోట్లరూపాయలు దొంగతనంగా కొట్టేయలేదని చెబుతాడా? ఇదే తన ప్రత్యర్ధులు చేసివుంటే పత్రికల్లో తాటికాయంత అక్షరాల్లో వచ్చివుండేది. ఇప్పుడుమాత్రం ఎక్కడో ఓ మూలన వేయటంచూస్తే పత్రికల నిబద్ధత మీద విశ్వాసం రోజు రోజుకీ సన్నగిల్లుతుంది . ఇందుకే మోడీ సుజనా చౌదరికి ముఖ్యమైన మంత్రి పదవి ఇవ్వలేదని చెబుతారు. ఓ వ్యాపారవేత్తకీ అదీ దొంగ వ్యాపారం చేసే వ్యక్తికీ పదవి ఇవ్వడంపై మోడీకి ఇష్టంలేకపోయినా సంకీర్ణధర్మంలో భాగంగా తప్పక ఇవ్వాల్సి వచ్చిందని చెబుతారు. అక్కడినుంచే చంద్రబాబుకీ మోడీకి చెడిందని పరిశీలకులు అనుకుంటున్నారు. మోడీ మీద రోజూ కారాలు మిరియాలు నూరటం వెనుక ఇటువంటి కధలు ఎన్నో ఉన్నాయని తెలుస్తూ వుంది. రేపు ఎన్నికల్లో కేంద్రం లో మోడీ అధికారం లోకి వస్తే చంద్రబాబు కి కష్టాలు తప్పవని అందరు అనుకుంటున్నారు. అందుకే ఫలితాల తర్వాత కదా మరింత రంజుగా వుండే అవకాశం వుంది.
Prev ఇంటర్ లో ఫెయిల్ అయ్యిందని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.