చంద్రబాబు ఎన్నికల తర్వాత ప్రచారంలో పెద్ద కుట్ర దాగి వుందా?

Article
ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి. పరిపాలన స్తంభించి పోయింది. కొత్తగా ఎన్నికల కమిటీ నియమించిన ప్రధాన కార్యదర్శి పై ప్రతి రోజూ విషప్రచారం సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆధ్వర్యాన జరుగుతుంది. దానికి వంతగా అనుకూల మీడియా ప్రచారం చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆంధ్రాలో వాతావరణం పూర్తిగా కలుషితమైంది. ఇప్పుడు నియమించిన ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ తో పాటు ముద్దాయిగా వున్నాడని అతన్ని నియమించటం పూర్తిగా రాజకీయమని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించటం వెనుక పెద్ద రాజకీయ కోణం ఉందని అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి అతనిపై ఆరోపణలు నిర్ధారించి ఉంటే పదవి లో కొనసాగలేడని చంద్రబాబునాయుడుకీ తెలుసు. అధికారులు ఏ పార్టీ అధికారం లో ఉంటే వాళ్లకు అనుకూలంగా పనిచేస్తారని అందరికీ తెలుసు. ఈ రాజకీయ ప్రచారం వెనుక చంద్రబాబునాయుడుకి పెద్ద భయం పట్టుకుందని అందరూ అనుకుంటున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే ఆర్ధిక కార్యదర్శి ని పిలిపించుకొని సమీక్ష చేశాడు. వెంటనే ఆర్ధిక కార్యదర్శి దీర్ఘకాల సెలవుపై వెళ్ళాడు. దీనిపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్ధిక శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయని అందుకే అయన సెలవుపై వెళ్లాడని తెలుస్తుంది. దీనిపై ప్రధాన కార్యదర్శి విచారణ చేపట్టాడని తెలుస్తుంది. ఇవి బయటపడితే చంద్రబాబునాయుడుకి, యనమల రామకృష్ణుడుకి ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. అందుకే చంద్రబాబునాయుడు ప్రధాన కార్యదర్శి పై వ్యక్తిగత విమర్శకు పూనుకొని తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాన కార్యదర్శి దర్యాప్తుకు ఎవరూ సహకరించకుండా ఉండాలంటే తిరిగి నేనే అధికారం లోకి వస్తానని అప్పుడు ఆ అధికారులకు ఇబ్బందులు తప్పవని ప్రచారం లో పెట్టారు. అందుకే తాను తిరిగి అత్యంత మెజారిటీ తో అధికారం లోకి వస్తానని అందుకు పథకాలే కారణమని ప్రభుత్వ అధికారుల్లో భావన కలిగించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మే 23 వ తేదీ వరకు ఈ భావనతో పరోక్షంగా అధికారంలో ఉండగలిగితే ప్రధానకార్యదర్శి ఏమీ చేయలేడని వ్యూహంగా తెలుస్తుంది. అదేసమయంలో 23 తర్వాత ఎన్నికల ఫలితం తారుమారయితే కూడా ఏం చేయాలో ఇప్పట్నుంచే వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవిఎం లపై పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ప్రచారం, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ప్రతిపక్షనాయకులను కూడగట్టడం, చివరకు ఈ మధ్య ఇవిఎం లను రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చని , ఓట్లు మోడీకి బదిలీ అవుతున్నాయని స్వయంగా ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. అందుకు జాతీయ మీడియా లో మోడీ వ్యతిరేక చానళ్ళు, యాంకర్ల ద్వారా తన ఆరోపణలకు విపరీత ప్రచారం కలిగేటట్లు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా ఓ పెద్ద వ్యూహంలో భాగంగానే జరుగుతుందని రాజకీయాలు పరిశీలించే వాళ్లకు అర్ధమవుతుందని అంటున్నారు. దీనిలో భాగంగానే చివరిలో ఓ బ్రంహాస్తాన్నిప్రయోగిస్తాడని అనుకుంటున్నారు. అదేంటంటే మే 19 వ తేదీన లగడపాటి రాజగోపాల్ తోటి టీడీపీ కి మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్ లో చెప్పించి ఫలితం వ్యతిరేకంగా వస్తే ఇవిఎం ల కుంభకోణం వలెనే ఓడి పోయానని ప్రజల్ని నమ్మించొచ్చని ప్లాన్ చేసినట్లుగా అనుకుంటున్నారు. అప్పుడు ఒకవేళ జగన్ గెలిచినా మోడీ తో లాలూచి పడి ఓట్లు తారుమారు చేసారని ప్రజల్ని నమ్మించవచ్చని దానికి సహకరించే మీడియా ఎటూ ఉందని వ్యూహంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఒకసారి జగన్ అధికారంలోకి వస్తే తనకు కష్టకాలం మొదలయినట్లేనని పరిశీలకులు చెప్పుకుంటున్నారు.
Prev విద్యార్థుల జీవితాలతో ఆడుకునే అధికారం వీళ్లకు ఎవరిచ్చారు?
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.