పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Article

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,563 పరీక్షా కేంద్రాలు,144 ఫ్లయింగ్, 4 ప్రత్యేక స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పది పరీక్షలకు 5,52,302 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మార్చి 22న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఇంగ్లీష్-2 పరీక్ష ఏప్రిల్ 3కు వాయిదా పడింది. హాల్ టికెట్లు అందని విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్ http://tghtd.bsetelangana.org/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

Prev ఎంపీ టికెట్‌ వద్దు, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి : మంత్రి శిద్దా అనుచరులు
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.