తన గర్ల్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉంటున్నాడని... ఫ్రెండ్స్‌తో కలిసి 14ఏళ్ల బాలుడి హత్య

తన గర్ల్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉంటున్నాడని... ఫ్రెండ్స్‌తో కలిసి 14ఏళ్ల బాలుడి హత్య

తన స్నేహితురాలితో వేరే అబ్బాయి చనువుగా ఉండటాన్ని చూడలేకపోయాడు. పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో లాభం లేకుండా పోయింది. దీంతో ఫ్రెండ్స్‌తో కలిసి శుక్రవారం రాత్రి ఆ అబ్బాయి ఇంటి వద్దకు వెళ్లాడు. మాట్లాడాలిరా అంటూ పిలిచారు. దీంతో వారి వద్దకు వెళ్లిడంతో వాదోపవాదాలకు చేశారు. గొడవ ముదరడంతో వచ్చిన అబ్బాయిని ఒక్కడ్నే చూసి గ్రూప్ అంతా ఒక్కసారిగా అతనిపై దాడికి దిగారు. కత్తులతో పలుసార్లు పొడిచారు.

దీంతో బాధితుడు సాయం కోసం అరుపులు.. పెట్టడంతో వాడిని అక్కడే రోడ్డుపై పడేసి పరారయ్యారు. దీంతో బాధితుడ్ని వెంటనే అతని తల్లి ఆస్పత్రికి తరలించింది. అయితే తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. విచారణలో మృతుడు నిందితుల్లో ఒకరైన గర్ల్ ఫ్రెండ్‌తో చనువుగా ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయమై అబ్బాయిని పిలిచి అమ్మాయితో ఎప్పుడూ మాట్లాడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తేలింది. అయినప్పటికీ అమ్మాయితో ... అబ్బాయి చనువుగా ఉండటం చూసే దాడి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి పక్కా ప్లాన్‌‌తోనే బాలుడ్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

more updates »