21 ఏళ్ల యువతిపై 10 మంది గ్యాంగ్‌ రేప్‌.. కారు నుంచి బయటకు లాగి

Article

21 ఏళ్ల ఓ యువతిపై 10 మంది గ్యాంగ్‌ రేప్‌ చేశారు. కారులో వెళుతున్న యువతిని బయటకు లాగి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన పంజాబ్‌లోని లూథియానాలో జరిగింది. వివరాల్లోకి వేళ్తే.. 21 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి లూథియానా నుండి కారులో శనివారం రాత్రి ఐజ్వాల్‌ గ్రామానికి వెళుతున్నారు. ఇది గమనించిన 10 యువకులు.. మూడు బైకులపై కారును వెంబడించారు. కారుపై రాళ్లతో దాడి చేస్తూ..అరుస్తూ.. వారిని భయభ్రాంతులకు గురిచేశారు. అయితే.. జాగ్రోన్‌ వద్దకు చేరుకోగానే కారుకు ఎదురు తిరిగి... వెంటనే యువతిని, ఆమె స్నేహితుడిని కారులోంచి బయటకు లాగేశారు. వీరిద్దరిని దగ్గరలోని కాలువ వద్దకు లాక్కెళ్లారు. కొంతమంది యువకుడిని పట్టుకోగా.. మిగిలిన వారు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ.. బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతోంది. కేసు దర్యాప్తులో ఉంది.

Prev ‘చింతమనేని’ ఇంటికి బయలుదేరిన యువతుల అదృశ్యం
Next ‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదు: కిషన్ రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.