హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం : 9 మంది మృతి

హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం : 9 మంది మృతి

న్యూఢిల్లీ : రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోల్‌బాగ్‌లోని అర్పిత్‌ ప్యాలెస్‌ అనే హోటలో అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఆరుగురు పురుషులు ఇద్దరు మహిళలు, ఒక శిశివు ఉన్నారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు మంటల్లో చిక్కుకున్నారని భావిస్తున్నారు. పాతికమందిని రక్షించగా, కేరళలోని ఒకే కుటుంబానికి చెందిన పదిమంది మంటల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. వీరి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు అందరూ గాఢనిద్రలో ఉండగా మంటలు అలుముకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. సిబ్బంది ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసుందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 26 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. సహాయ, రక్షణచర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది

more updates »