నగ్నంగా నిలబడితేనే.. యాక్టింగ్‌ నేర్పిస్తా

Article

యాక్టింగ్‌ నేర్పిస్తానని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని.. అందుకు ‘అన్ని విధాలుగా’సిద్ధంగా ఉండాలని ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడో యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకుడు. రెండు రోజుల క్రితం హిమయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. కవాడిగూడకు చెందిన అచ్నిత్‌ కౌర్‌కు యాక్టింగ్‌ అంటే ఇష్టం. నటనలో శిక్షణ పొందేందుకు హిమాయత్‌నగర్‌లోని ‘సూత్రధార్‌’ఇనిస్టిట్యూట్‌లో కొద్ది రోజుల క్రితం చేరింది. ఆ సంస్థ నిర్వాహకుడు వినయ్‌వర్మ 20 ఏళ్లుగా నటనలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న యువతులను లైన్‌లో నిలబెట్టి అందరూ దుస్తులు విప్పాలని వినయ్‌ ఆదేశించాడు. దీనికి అచ్నిత్‌ కౌర్‌ నిరాకరించింది. దుస్తులు విప్పితేనే యాక్టింగ్‌ నేర్పిస్తానంటూ అతను అసభ్యకరంగా మాట్లాడాడు.

ఈ నెల 15న ఉదయం 6:30 గం.లకు క్లాస్‌కు రమ్మంటే వెళ్లామని... యాక్టింగ్ గురుగా వచ్చిన వినయ్ వర్మ, తనతో పాటు మరో ఎనిమిది మంది అమ్మాయిలను ఓ గదిలో బంధించాడని పేర్కొంది. నటన నేర్చుకోవాలంటే తన ముందు బట్టలన్నీ విప్పి, నగ్నంగా నిల్చోవాలని చెప్పాడు వినయ్ వర్మ. నటన నేర్చుకుని, సినిమాల్లో వెలిగిపోదామని అనుకుని యాక్టింగ్ స్కూల్‌కి వచ్చిన అమ్మాయిలు... ఏ మాత్రం అభ్యంతరం లేకుండా బట్టలు విప్పి, నగ్నంగా నిల్చున్నారు. న్యూడ్‌గా క్లాసులు వినడానికి ఒప్పుకోని ఓ యువతి మాత్రం... వినయ్ వర్మకు ఎదురు తిరిగింది. నటనకు నగ్నంగా నిలబడడానికి సంబంధం ఏంటని నిలదీసింది. దాంతో ఆమెను క్లాస్ నుంచి బయటికి పంపేశాడు యాక్టింగ్ గురు వినయ్ వర్మ. తనకు జరిగిన షాకింగ్ అనుభవం నుంచి బయటికి వచ్చిన ఆమె... హైదరాబాద్ షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. అయితే వారు సరిగా స్పందించకపోగా హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయల్సిందిగా సలహా ఇచ్చారు. నారాయణగూడ పోలీసులు కూడా సరిగ్గా స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించి, తన గోడు వెల్లడించుకుంది సదరు యువతి. అయితే వినయ్ వర్మ మాత్రం తాను చెప్పినట్టు బట్టలు విప్పి, సిగ్గు బిడియం పక్కనబెట్టి యాక్టింగ్ నేర్చుకుంటే సినిమాల్లో అద్భుతంగా రాణిస్తారని చెబుతుండడం కొసమెరుపు. గతంలో చాలామంది ఇలాగే యాక్టింగ్ నేర్చుకున్నారని, వారు ఇప్పుడు ఉన్నతస్థానాల్లో ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. మహిళా సంఘాలు మాత్రం వినయ్ వర్మను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమాల్లో అవకాశాల కోసం బట్టలు విప్పిస్తారని తెలుసు కానీ యాక్టింగ్ నేర్చుకోవడానికి కూడా బట్టలు విప్పాల్సి వస్తుందని తెలిసి... సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు సినీ ఫ్యాన్స్.

ఈ ఘటనపై నిలదీసేందుకు సదరు ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఛాయదేవి, సెన్సార్‌ బోర్డ్‌ సభ్యురాలు భారతికి వినయ్‌వర్మ షాకిచ్చాడు. ‘గత 20 ఏళ్లుగా ఇనిస్టిట్యూట్‌ని నడుపుతున్నాను. బట్టలిప్పాల్సిందేనని ముందే చెబుతా. అందుకు వారు అంగీకరించే వస్తారు. మీరెందుకు హడావుడి చేస్తున్నారు’అంటూ దబాయించాడు. ఈ ఇనిస్టిట్యూట్‌ని మూసివేయాలని, వినయ్‌వర్మని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఛాయదేవి, భారతి డిమాండ్‌ చేశారు.

వినయ్‌వర్మ వ్యవహారశైలిపై లోతుగా విచారణ జరుపుతున్నామని అబిడ్స్‌ ఏసీపీ బిక్షంరెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి ప్రారంభించిన శిక్షణలో ఏడుగురు యువకులు, ఇద్దరు యువతులు చేరినట్లు వివరించారు. 14న వీరందరినీ దుస్తులు విప్పి యాక్టింగ్‌ చేయండనడంతో అచ్నిత్‌ కౌర్‌ వ్యతిరేకించిందన్నారు. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో వినయ్‌వర్మపై సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.

Prev లోకసభ ఎన్నికలు 2019: పశ్చిమ బెంగాల్‌ రాయ్‌గంజ్‌లో ఉద్రిక్తత
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.