మోడీతో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ

ప్రధాని కావాలని తాను కలగనలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ తాను సన్యాసి జీవితాన్ని ఇష్టపడతానని చెప్పారు. తనకు బయోగ్రఫీలు చదవడం ఇష్టమని ఆయన అన్నారు. తాను పని చేస్తూ అందరితో పని చేయిస్తానని ఆయన చెప్పారు. తనతో జరిగే సమావేశాల్లో ఎవరూ మొబైల్‌ ఫోన్లు వాడరని, తాను కూడా ఎవరితోనైనా భేటీ అయినప్పుడు ఫోన్‌ వాడనని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు అప్పుడప్పుడు మిఠాయిలు పంపుతారని ఆయన అన్నారు. తాను అధికారులందరికీ స్నేహితుడనని ఆయన అన్నారు. తాను కఠినంగా ఉంటానని, అలాగని ప్రజలను ఇబ్బంది పెట్టాలని అనుకోనని ఆయన అన్నారు. తాను స్కూల్‌లో చదివే సమయంలోనే బ్యాంక్‌ ఖాతా తెరిచానని ఆయన చెప్పారు. అయితే అందులో డబ్బు వేయలేదని, 32 సంవత్సరాలపాటు జీరో బ్యాలెన్స్‌తో సాగిందని ఆయన అన్నారు.
Prev సోషల్‌మీడియా వార్తలపై స్పందించిన పవన్‌
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.