ఓటమి భయంతోనే కోడెల ఇనిమెట్లలో గందరగోళం సృష్టించారు

Article

గుంటూరు : ఓటమి భయంతోనే టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌ ఇనిమెట్లలో గందరగోళం సృష్టించారని వైఎస్సార్‌ సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గెలవడం కోసం కోడెల ఎంతకైనా బరితెగిస్తారని విమర్శించారు. అధికారుల్ని,ఓటర్లను బెదిరించడం, పోలింగ్‌ బూతును క్యాప్చర్‌ చేయడం ఆయనకు అలవాటైన పని అన్నారు. ఇనిమెట్లలో కోడెల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రజలను భయపడడం వల్లే గొడవ జరిగిందన్నారు. ఇనిమెట్ల గ్రామస్తులను భయపెట్టాలని చూస్తే ఉరుకోమని హెచ్చరించారు. సీఎం ఆఫీసు నుంచి ఒత్తిడి రావడంతో గ్రామస్తులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము ఇనిమెట్ల గ్రామానికి వెళ్లకపోయినా తమపై కేసులు పెట్టారని, అయినా భయపడేది లేదని తేల్చి చెప్పారు.రిగ్గింగ్‌కు పాల్పలడ్డారని కోడెలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాని మీద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

కోడెలపై దాడి కేసులో పోలీసుల సోదాలు
కాగా ఎన్నికల రోజు గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నేరుగా 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఆయన తలుపులు వేసుకున్నారు. గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారు. స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులేసుకొని ఉండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల.. సొమ్మసిల్లి పడిపోయారు.

Prev ఏపి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
Next మద్యం మత్తులో అధికారులు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.