ఆంధ్రప్రదేశ్ లో కుల పిచ్చి పరాకాష్టకు చేరుకుంది!: జేసీ దివాకర్ రెడ్డి

Article

అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కులపిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ నేత, లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదని అభిప్రాయపడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీడీపీ గెలుస్తుందనీ, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మహిళల ఆదరణ వల్లే టీడీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని అభిప్రాయపడ్డారు.

టీడీపీ నేతలతో కలిసి ఈరోజు ఢిల్లీకి చేరుకున్న దివాకర్ రెడ్డి, మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలితో పాటు ఈవీఎంల సమస్యను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తాము ఢిల్లీకి వచ్చామని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో నల్లధనం, అవినీతిని నిరోధించాలని ఈసీని కోరతామన్నారు. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ క్వీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు.

Prev ఓటమి భయంతోనే కోడెల ఇనిమెట్లలో గందరగోళం సృష్టించారు
Next మద్యం మత్తులో అధికారులు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.