ఇక రాష్ట్రమంతా వాహనాలకు ఒకే సిరీస్

Article

ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుండి నూతన వాహనాల రిజిస్ట్రేషన్స్‌కు ఒకే సిరీస్ నెంబర్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు జి ఓ విడుదల చేసింది. గతంలో రవాణా వాహనాలకు జిల్లాల వారీగా సిరీస్ నెంబర్లు ఉండేవి. దీంతో ఏ జిల్లా వాహనాలు ఆజిల్లాలోనే రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాల్సి వచ్చేది. ఈ వ్యవహారం వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. అంతేకాదు...సమయం, డబ్బు వృధా అయ్యేవి. అయితే ఈ వెసులుబాటుతో ఆ పరిస్థితి మారనుంది. దీంతో రాష్ట్రంలోని ఏ వాహనం రిజిస్ట్రేషన్ అయినా ఎక్కడినుంచైనా చేయించుకోవచ్చు.

అంతేకాకుండ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగే వహనాలకు ఒకే సిరీస్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. రవాణా శాఖ తీసుకున్న ఈనిర్ణయం దేశంలోనే ప్రధమం అని , రవాణా శాఖకు అధిక ఆదాయం రావడంతోపాటు వాహన దారులకు సమయం డబ్బు ఆదా అవుతుందని మంత్రి అచ్చన్నాయుడు పేర్కొన్నారు.

Prev చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలిఅంటే ఏదో అద్భుతం జరగాలి: ఉండవల్లి అరుణ్ కుమార్
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.