ఎంపీగా వంగవీటి రాధా... నియోజకవర్గంపై క్లారిటీ!

Article

అమరావతి: వైసీపీకి గుడ్‌బై చెప్పిన వంగవీటి రాధా.. ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే విషయంపై మాత్రం గురువారం మధ్యాహ్నం క్లారిటీ వచ్చేసింది. లోక్‌సభ బరిలో దిగే యోచనలో వంగవీటి రాధా ఉన్నారు. విజయవాడను వదిలేసి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర వైపు ఆయన చూస్తున్నారు. పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ అధిష్టానం ప్రతిపాదన పెట్టడంతో ఆయన రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

కాగా.. నరసాపురం, అనకాపల్లి లోక్‌సభ స్థానాల నుంచి రాధా పోటీపై అధిష్టానం పరిశీలించింది. అయితే రాధా అనకాపల్లిపై మొగ్గుచూపుతున్నారు. ఈ విషయమై ఇవాళ సాయంత్రానికి కల్లా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్.. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అవంతి వైసీపీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని సమాచారం. కాగా సొంత జిల్లాను వదిలి వెళ్తున్న వంగవీటి రాధాకు విశాఖ ఏమాత్రం కలిసొస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Prev సౌతాఫ్రికాలో ఎంపీ కవిత బర్త్‌డే వేడుకలు
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.