ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నాం: పవన్‌

Article

రాజమండ్రి: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌లో చదువు ఆపేసినా... చదవడం ఆపలేదన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని, కానిస్టేబుల్‌ ఇంట్లో పుట్టిన ఓ వ్యక్తి 2019లో సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గెలుపోటములు తెలియదు... యుద్ధం చేయడమే తెలుసన్నారు. సీఎం పదవిపై కోరిక లేదని, అందలం ఎక్కాలని ఆశ లేదని చెప్పారు. పవర్‌స్టార్‌ పదంపైనే ఆసక్తి లేదని, సీఎం పదవిపై ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. అన్యాయంపై గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌కల్యాణ్ చెప్పారు.

Prev మత్స్యకారులకు రాహుల్ శుభవార్త
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.