ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం

Article

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా... ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు సభ్యుల చేత ప్రమాణ చేయించారు. గత నెల 30న ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మిగతా సభ్యులు అక్షర క్రమంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Prev నీరసంగా...చంద్రబాబు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం
Next జగన్ సర్కారుకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టదు: యనమల
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.