మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: చంద్రబాబు

మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: చంద్రబాబు
లోక్‌సభ ఎన్నికల మూడవ దశ పోలింగ్‌లో ఇవిఎంలు మొరాయించడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివిఎంలు, వివిప్యాట్‌లపై మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు. కనీసం 50 శాతం వివిప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్‌సిపి, టిఎంసి, ఆప్‌, సిపిఎం, సిపిఐ, డిఎంకె పార్టీల నేతలతో కలిసి చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఇవిఎంలను ట్యాంపర్‌ చేయవచ్చునని, హాక్‌ చేసి ప్రోగ్రామింగ్‌లో తప్పులు దొర్లేలా చేయడం సాధ్యమేనని ఆయన అన్నారు. ఇవిఎంలపై తమకు తీవ్రమైన అనుమానాలున్నాయని ఆయన చెప్పారు.
more updates »