ఏపి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

Article

అమరావతి: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్‌ విడుదలైంది. ఫస్టియర్‌ పరీక్షలను మే 14 నుంచి 22 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్‌ పరీక్షలను అదేరోజుల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాజమండ్రిలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, 29న ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఫీజు గడువు ఈ నెల 24 వరకు ఉంది. కాగా, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు సంబంధించి సమాధానపత్రాల రీ వెరిఫికేషన్‌ కమ్‌ స్కా నింగ్‌ కాపీ సరఫరా, మార్కుల రీకౌంట్‌ కోరుకునే అభ్యర్థులు ఈ నెల 22లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని ఇంటర్‌బోర్డు సెక్రెటరీ బి. ఉదయలక్ష్మి తెలిపారు.

Prev నటి సంగీతపై తల్లి ఫిర్యాదు
Next మద్యం మత్తులో అధికారులు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.