ఏపీలో టీడీపీ గెలుపు పక్కా: చంద్రబాబు

Article
వివిధ జాతీయ చానళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీలో టీడీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. ప్రజల నాడిని తెలుసుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని పేర్కొన్నారు. గతంలోనూ వాస్తవ ఫలితాలకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్‌ నుంచి తాము వెనక్కి తగ్గబోమని చంద్రబాబు స్పష్టం చేశారు.
Prev ఎగ్జిట్ పోల్స్‌తో భారీ కుట్ర..మమత బెనర్జీ ఫైర్
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.