ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఖరారు...

Article

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి నెలలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలకు సంబందించిన షెడ్యూలు ను విడుదల చేసారు మంత్రి గంటా శ్రీనివాసరావు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఈ ఏడాది పరీక్షలకు 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,833 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంటా మీడియా కు తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి సూచించారు.

Prev చంద్రబాబుది ధర్మపోరాట దీక్ష కాదు దొంగ దీక్ష: ఉమ్మారెడ్డి
Next ప్రతి మహిళను లక్షాధికారులను చేస్తాం: రోజా
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.