ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్... రేపటి నుంచి వీక్లీ ఆఫ్ అమలు

ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్... రేపటి నుంచి వీక్లీ ఆఫ్ అమలు

రాష్ట్రంలోని పోలీసులకు ప్రభుత్వం తియ్యని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారాంతపు సెలవుల విధానాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనుంది. ఇకమీదట పోలీసులకు కూడా ప్రతివారం ఓ సెలవు ఉంటుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీసు విభాగం కొత్తగా వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ మేరకు ఏపీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ఉత్తర్వులు జారీచేశారు.

దీనిపై ఆయన వివరాలు తెలిపారు. కానిస్టేబుల్ నుంచి సీఐ ర్యాంకు అధికారుల వరకు వారాంతపు సెలవులు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెట్టామని, ఇకమీదట ప్రతినెలా వారాంతపు సెలవులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అయ్యన్నార్ వెల్లడించారు. పని ఒత్తిడితో పోలీసులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వారాంతపు సెలవుతో పోలీసులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు.

ముఖ్యంగా పోలీసులు బందోబస్తులు, వారెంట్స్, జనరల్ డ్యూటీ విభాగాల్లో పనిచేస్తున్న వారి విధులకు ఆటంకం కలుగకుండా ఒక రోజు వీక్లీ ఆఫ్ అమలు చేయనున్నారు. అలాగే ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలోనూ, సెక్యూరిటీ విధులు నిర్వహించే సిబ్బంది విషయంలోనూ పరిస్థితులకు అనుగుణంగా వీక్లీ ఆఫ్ ఇవ్వనున్నారు. అలాగే ట్రాఫిక్ విభాగంలో కూడా వీక్లీ ఆఫ్ సీనియారిటీ ప్రకారం ఇవ్వనున్నారు. అయితే అత్యవసర సమయాల్లో వీక్లీ ఆఫ్ రద్దు చేసుకొని డ్యూటీలో చేరేలా ఒప్పంద పత్రం రాసివ్వాల్సిన అవసరం ఉంది.

అలాగే రవిశంకర్ అయ్యనార్ కమిటీ సిఫార్సుల రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. పోలీసు డిపార్ట్ మెంట్లో 20 శాతం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పోలీసు విభాగంలో 12300 ఖాళీ ఉన్నట్లు, దీనిపై కమిటి రిపోర్ట్ పేర్కొన్నట్లు సవాంగ్ తెలిపారు.. దీంతో పాటు వీఐపీ, యాంటి నక్సల్ డ్యూటి కోసం ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ఖాళీలు భర్తి చేస్తా.. అవసరం అనుకుంటే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని ఉపయోగించుకుంటామని అన్నారు. అలాగే పోలీసులు ఒత్తిడి వల్ల స్ట్రోక్స్ , కిడ్ని , షుగర్ వ్యాదులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన పదిపదిహేళ్లలోనే పోలీసులు చనిపోతున్నారని తెలిపారు.

more updates »