ఏపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీలు

Article

దేశమంతా ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ పరంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. విజయవాడ సెంట్రలక్ష నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు అతి స్వల్ప మెజారిటీలో గట్టెక్కారు.

అత్యధిక ఆధిక్యంతో గెలుపొందిన టాప్ 5 అభ్యర్థులు:
 1. పులివెందులలో సతీశ్‌కుమార్‌ రెడ్డిపై వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి 90110 ఓట్ల భారీ మెజారిటీ
 2. గిద్దలూరులో ముత్తుముల అశోక్‌రెడ్డిపై అన్నా రాంబాబుకు 81035 ఓట్ల ఆధిక్యం
 3. సూళ్లూరుపేటలో పర్సా వెంకట రత్నయ్యపై కలివేటి సంజీవయ్య 61292 ఓట్ల ఆధిక్యం
 4. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డికి 55207 మెజారిటీ
 5. కడపలో అమీర్‌బాబు నవాజ్‌షాన్‌పై అంజాద్‌ భాషా 54794 ఆధిక్యం
అత్యల్ప ఓట్లతో గెలిచిన టాప్ 5 అభ్యర్థులు :
 • విజయవాడ సెంట్రల్‌: టీడీపీ అభ్యర్థి బొండా ఉమాపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్ల తేడాతో గెలిచారు
 • తిరుపతి: టీడీపీ అభ్యర్థి సుగుణపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి 708 ఓట్ల తేడాతో గెలిచారు
 • రాజోలు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ 814 ఓట్ల తేడాతో గెలిచారు
 • గన్నవరం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 838 ఓట్ల తేడాతో గెలిచారు
 • వేమూరు: టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్‌బాబుపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ౯౯౯ ఓట్ల తేడాతో గెలిచారు
 • Prev వైఎస్‌ జగన్‌కు మహేశ్‌ అభినందనలు
  Next జగన్ సర్కారుకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టదు: యనమల
   

  0 Comments

  Write a comment ...
  Post comment
  Cancel
   Please submit your comments.