అరుణ్ జైట్లీ అస్తమయం!

అరుణ్ జైట్లీ  అస్తమయం!

ఆధునిక భారతదేశపు ఎత్తైన వాస్తుశిల్పులలో ఒకరు, నిష్ణాతుడైన న్యాయవాది, అత్యుత్తమ పార్లమెంటు సభ్యుడు, గొప్ప నిర్వాహకుడు మరియు అద్భుతమైన మానవుడు - శ్రీ అరుణ్ జైట్లీ మనతో లేరు

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ రోజు మధ్యాహ్నం 12.07 గంటలకు అరుణ్‌ జైట్లీ తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటివరకు జైట్లీ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్, రామ్‌విలాస్ పాశ్వాన్, తెలంగాణ లో ఉన్న అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, జ్యోతిరాధిత్య సింథియా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు జైట్లీ మృతి కి సంతాపం తెలియజేసారు. ఇంకా పలువురు నేతలు ఆయన మరణానికి ట్వీటర్ లో సంతాపం తెలియజేస్తున్నారు.

ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ మరియు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్లను దేశం కోల్పోయిన కొన్ని రోజుల తరువాత, జైట్లీ మరణ వార్త దేశాన్ని ద్రిగ్బంతిలోకి నెట్టేసింది

more updates »