బీజేపీకి ఎంత ధైర్యం?: అసదుద్దీన్

తాను శపించడం వల్లే ముంబై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడని బీజేపీ నేత ప్రజ్ఞా సాధ్వీ చెప్పడంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రజ్ఞా లాంటి వ్యక్తులతో పోరాడుతూనే కర్కరే ప్రాణాలు కోల్పోయారని చురకలు అంటించారు. అమరులను అవమానించడానికి బీజేపీకి ఎంత ధైర్యమని ప్రశ్నించారు.

ఈరోజు ట్విట్టర్ లో అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ..‘హేమంత్ కర్కరే ఎవరితో అయితే పోరాడుతూ చనిపోయారో, వాళ్లకు-మీకు పెద్దగా తేడా లేదు. మీరు బాధపడ్డందుకు, శపించినందుకు కర్కరే చనిపోలేదు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును, ఓటేసే మన హక్కును కాపాడటం కోసం పోరాడుతూ అమరుడయ్యారు. మన అమరులను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంత ధైర్యం?’ అని నిలదీశారు.

Prev రైల్ నిలయంలో అగ్నిప్రమాదం
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.