అసెంబ్లీలో గంట మోగించ‌డం త‌ప్ప స్పీక‌ర్ చేస్తున్న ప‌ని ఇంకేమైనా ఉందా..

అసెంబ్లీలో గంట మోగించ‌డం త‌ప్ప స్పీక‌ర్ చేస్తున్న ప‌ని ఇంకేమైనా ఉందా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యేల వైఖ‌రిపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. త‌న‌దైన శైలిలో వ‌రుస ట్వీట్ల‌తో సెటైర్లు పేల్చారు. అసెంబ్లీలో ప్ర‌స్తుత‌ ఎమ్మెల్యేల ప్ర‌వ‌ర్త‌న‌, స్పీక‌ర్ ప‌రిస్థితి గురించి ట్వీట్లు చేశారు. `అసెంబ్లీలో గంట మోగించ‌డం త‌ప్ప స్పీక‌ర్ చేస్తున్న ప‌ని ఇంకేమైనా ఉందా.. జ‌స్ట్ ఆస్కింగ్‌` అంటూ మొద‌ట‌ ట్వీట్ చేశారు.

అనంతరం `అసెంబ్లీలో స్పీక‌ర్ గంట మోగిస్తుంటే నాకు స్కూల్ బెల్ గుర్తుకొస్తోంది. ఎందుకంటే స‌భ‌లో ఎమ్మెల్యేల ప్ర‌వ‌ర్త‌న స్కూల్ పిల్ల‌ల‌లాగానే ఉంది`, `అసెంబ్లీ స‌మావేశాలు.. ఒక‌రిపై ఒక‌రు అరుచుకోవ‌డం, ఒక‌రినొక‌రు బెదిరించుకోవ‌డం, గ‌తం గురించి ఫిర్యాదులు చేసుకోవ‌డం కోస‌మా? లేదా ప్ర‌జా స‌మ‌స్య‌లు చ‌ర్చించ‌డం కోస‌మా.. జ‌స్ట్ అస్కింగ్‌` అంటూ వ‌రుస ట్వీట్లు చేశారు.


more updates »