బాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యలు జరుగుతున్నాయి: జగన్

Article

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మా కుటుంబంలో హత్యలు జరుగుతున్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తిని కిరాతకంగా చంపేసారు. ఇంట్లోకి చొరబడి వైఎస్ వివేకానంద రెడ్డిని కత్తులతో నరికి హత్య చేశారన్నారు. ఈ కేసులో దర్యాపు జరుగుతున్న తీరుపై అనుమానాలున్నాయి. బెడ్ రూమ్ లో చంపేసి బాత్ రూమ్ వరకు తీసుకెళ్లారు. బాత్ రూమ్ లో రక్తాన్ని పోశారని జగన్ ఆరోపించారు. డ్రైవర్ మీద నెపం నెట్టడానికి లెటర్ సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. విచారణ జరుపుతున్న అధికారులకు నా కళ్ళ ముందే ఫోన్లు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే అధికారులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. మా నాన్న మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాయి. బాబాయ్ హత్యపై సీబీఐ విచారణ విచారణకు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

Prev వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
Next జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.