బాలకృష్ణ ఇష్యూ.. నాగ‌బాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్..

Article

నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న వార్తలు ఎంతగా వైరల్ అవుతున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ఆయ‌న చేసిన ప్రతి కామెంట్ కూడా సంచలనం సృష్టించింది. కథానాయకుడు విడుదలకు ముందు నాగబాబు ఇలా చేయడం వెనక భారీ ప్లాన్ ఉందని.. మెగా కుటుంబం నుంచి ఇద్దరు హీరోలు ఈ పండక్కి తమ సినిమాలతో ఉండటంతోనే ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై అంచనాలు తగ్గించడానికి నాగబాబు ఇలా కామెంట్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై నాగబాబు స్పందించకపోయినా కూడా సమర్థించుకున్నాడు. కథానాయకుడు విడుదల సమయంలో నాగబాబు ఇలాంటి కామెంట్స్ చేయడం ఆ సినిమా కలెక్షన్లు తగ్గించడానికే అని.. క‌థానాయ‌కుడుకు ఊహించిన కలెక్షన్లు రావ‌డంలో ఎన్టీఆర్ బయోపిక్ వెనకబడిపోవడానికి నాగబాబు చేసిన నెగిటివ్ ప్రచారం కూడా ఓ కారణం అని అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో విడుదలైన రామ్ చరణ్ సినిమాకు అత్యంత దారుణమైన టాక్ రావడంతో ఇప్పుడు నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఎవరు త‌వ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్న‌ట్లు త‌యారైంది ఇప్పుడు నాగబాబు ప‌రిస్థితి. కథానాయకుడు సినిమా బాగున్నా కూడా వసూళ్లు రావడం లేదు. కానీ ఇప్పుడు విడుద‌లైన విన‌య విధేయ‌ రామ సినిమా మాత్రం చూడటానికి కూడా పనికిరాదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. తన హీరోలను కాపాడబోయి నాగబాబు చేసిన ప్రచారం వికటించిందంటూ సెటైర్లు వేస్తున్నారు నందమూరి అభిమానులు. మరి దీనిపై మెగా బ్రదర్ ఎలా స్పందిస్తాడో అనేది చూడాలి.

Prev నాన్నకు సాయంగా ఉంటూ...‘హిందీ’ నేర్చుకున్నా: ప్రధాని మోదీ
Next జగన్ సర్కారుకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టదు: యనమల
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.