బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసిన ఫిలిప్పిన్‌కు చెందిన మేనేజర్

Article

బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి సొమ్ము కాజేసిన మాజీ బ్యాంకు ఉద్యోగికి భారీ జరిమానాతో పాటు సుదీర్ఘ జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి దాదాపు 81 మిలియన్ డాలర్లు (రూ.570 కోట్లకు పైనే) చోరీ చేసింది ఫిలిప్పిన్‌కు చెందిన మాజీ బ్యాంకు ఉద్యోగి. షాడో హ్యాకర్లతో కలిసి దోపిడీకి పాల్పడిన బ్యాంకు ఉద్యోగిని కఠినంగా శిక్షించాలని తాజాగా తీర్పును వెలువరించింది ఫిలిప్పిన్ న్యాయస్థానం. రిజాల్ కమర్షియల్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (RCBC) అనే ఫిలిప్పిన్ బ్యాంకులో పనిచేస్తున్న మైయో డిగుటో అనే మహిళ 2016లో షాడో హ్యాకర్లతో కలిసి దోపిడికి పాల్పడింది. బంగ్లాదేశ్, యూఎస్ బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తం డబ్బును ఆర్‌సీబీసీ బ్యాంకు ఖాతాలకు మళ్లించింది. ఆ వెంటనే ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకున్నారు.

ఈ భారీ హ్యాకింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసును విచారణ చేపట్టిన మనీలా కోర్టు... రెండేళ్ల తర్వాత తీర్పును వెలువరించింది. హ్యాకింగ్ ద్వారా ఛీటింగ్ జరిగిన సమయంలో ఆర్‌సీబీసీ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న మైయా డిగుటోపై... హ్యాకింగ్‌కు సహకరించడం, నగదు చోరీ, మనీలాండరింగ్ వంటి ఎనిమిది రకాల కేసులు నమోదు అయ్యాయి. ఒక్కో కేసుకు కనీసం నాలుగు సంవత్సరాల నుంచి ఏడేళ్ల దాకా జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది ఫిలిప్పిన్ కోర్టు. మొత్తంగా 32 ఏళ్ల నుంచి 56 ఏళ్ల దాకా జైలుశిక్ష పడనుంది మైయా డిగుటోకి. దీంతో పాటు 109 మిలియన్ డాలర్ల జరిమానా (దాదాపు రూ.767 కోట్లకు పైనే) విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆమె చేసిన క్రైమ్ విలువ కంటే విధించిన జరిమానా దాదాపు రూ. 200 కోట్లు ఎక్కువ కావడం విశేషం. అయితే హ్యాకింగ్ చోరీ జరిగిన విషయం పసిగట్టిన వెంటనే... దాదాపు 15 మిలియన్ డాలర్లు (రూ. 105 కోట్లకు పైనే) వెనక్కి రాబట్టగలిగారు అధికారులు.

Prev సైకిల్ సవారీ చేసిన కలెక్టర్ హరిత
Next జగన్ సర్కారుకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టదు: యనమల
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.