భయం నా రక్తంలో లేదు: కేశినేని నాని

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని చవిచూసినప్పటికీ, విజయవాడ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన కేశినేని నాని, ఫేస్ బుక్ వేదికగా, పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన నేడు మరో పోస్ట్ పెట్టారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీదా ఆధారపడే వ్యక్తిని కాదన్నారు.

"నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు" అని ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Prev బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాదం: 36 మంది పిల్లలు మృతి
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.