భయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారు: దేవినేని ఉమ

Article

ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని... 23న ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తాము సంబరాలు చేసుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసుకుని, తెలంగాణలో వైసీపీ అధినేత జగన్ సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏం చూసి ప్రజలు జగన్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు. అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటు వేస్తారని అన్నారు. రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకే ఓటు వేశారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావన ప్రజల్లో బలంగా ఉందని అన్నారు.

Prev కౌంటింగ్ నాడు ర్యాలీలు రద్దు, మద్యం బంద్
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.