పొరపాటున బిజెపికి ఓటువేసి వేలు నరుక్కున్న యువకుడు

Article
లక్నో : ఆ యువకుడు బహుజన్‌ సమాజ్‌ పార్టీకి వీరాభిమాని. కానీ లోక్‌సభ ఎన్నికల్లో పొరపాటున ఏనుగు గుర్తుకు బదులు.. కమలం పువ్వు గుర్తు వద్ద మీట నొక్కి ఓటేశాడు. వేరే అభ్యర్థికి ఓటు వేయడాన్ని జీర్ణించుకోలేని ఆ బీఎస్పీ వీరాభిమాని ఓటేసిన తన వేలిని కత్తితో నరుక్కున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్‌లో లోక్‌సభ రెండో దశ ఎన్నికల పోలింగ్‌లో చోటు చేసుకుంది.

శిఖాపూర్‌ ఏరియాలోని అబ్దుల్లాపూర్‌ హులషాన్‌ గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌(25) బీఎస్పీకి వీరాభిమాని. అయితే రెండో దశ ఎన్నికల్లో భాగంగా బులంద్‌షార్‌ నియోజకవర్గానికి నిన్న ఎన్నికలు జరిగాయి. ఎస్పీ -బీఎస్పీ - ఆర్‌ఎల్డీ కూటమి అభ్యర్థి యోగేశ్‌ వర్మకు బదులుగా బీజేపీ అభ్యర్థి భోలా సింగ్‌కు పవన్‌ కుమార్‌ పొరపాటున ఓటేశాడు. దీంతో వేరే అభ్యర్థికి ఓటేయడాన్ని జీర్ణించుకోలేని పవన్‌ కుమార్‌.. తన వేలిని తానే నరుక్కున్నాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Prev బీజేపీకి ఎంత ధైర్యం?: అసదుద్దీన్
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.