ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Article

రంగారెడ్డి : తెల్లవారుజామున ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి అంబులెన్స్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రావిరాల ఓ ఆర్‌ఆర్‌ ఎక్సిట్‌ 13 అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై శంషాబాద్‌ నుంచి బొంగులూరు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఏలూరు నుంచి ఓ రోగిని ఆసుపత్రికి తీసుకు వస్తున్న అంబులెన్స్‌ను ఢీ కొట్టింది.

దీంతో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Prev మారుతీ సుజుకీ ఈరోజు నుండి కారు ధరలు పెంపు
Next తాను పెంచుకున్న మొసలికే ఆహారమైన మహిళా సైంటిస్ట్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.