విజయవాడ ఏటీఎం సెంటర్ లో అగ్నిప్రమాదం

Article

విజయవాడ: విజయవాడలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.కానీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేటప్పటికీ ఏటీఎం కేంద్రంలోని యంత్రాలు దగ్దం అయ్యాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బ్యాంక్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Prev వైసీపీ లో చేరిన దాసరి కుమారుడు
Next అంగరంగ వైభవంగా.. శివపార్వతుల కల్యాణోత్సవం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.