
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పేరుతో డిల్లీలో చేస్తున్న దీక్షకు హాజరు కారాదని సిపిఐ,సిపిఎం పక్షాలు నిర్ణయించుకున్నాయి.ప్రభుత్వం తమను ఆహ్వానించిందని,కాని తాము వెళ్లదలచుకోలేదని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి పి.మధు చెప్పారు. గతంలో తాము ప్రత్యేక హోదా కసం ఆందోళనలు చేసినప్పుడు తమపై చంద్రబాబు కేసులు పెట్టించారని, జైళ్లకు పంపారని వారు అన్నార. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని వారు వ్యాఖ్యానించారు.
Please submit your comments.