చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడా?

Article

ఘోర ఓటమిని చవిచూసిన నారా చంద్రబాబు నాయుడుకి ఒక్కసారిగా ఏంచెయ్యాలో అర్థంకాని స్థితిలో వున్నట్టుగా అనిపిస్తుంది. మీడియాలో వస్తున్న కధనాలు ప్రకారం, చంద్రబాబుకి ప్రతిపక్ష నేతగా ఉండాలనే ఆశ పూర్తిగా పోయినట్టుగా వుంది తన ప్లేస్ లో మరో ముఖ్య నేతను తెదేపా ప్రతిపక్ష నేతగా ఎంపికచేయాలనే ఆలోచనలో వున్నట్టుగా అనిపిస్తుంది.

ఇకపోతే చంద్రబాబు నాయుడు పై సోషల్ మీడియా వేదికగా కుళ్ళు జోకులు పేలుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేస్తున్నారు. తాను ప్రజల కోసం అహర్నిషులు కష్టపడుతున్నానని, కనీసం తన మనవడు దేవాన్ష్‌తో ఆడుకోవటానికి కూడా సమయంలేదని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.."ఇక టైమ్‌ వచ్చింది నీ మనవడితో ఆడుకోపో" అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Prev చంద్రబాబుకు కలిసిరాని 23
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.