చంద్రబాబుది ధర్మపోరాట దీక్ష కాదు దొంగ దీక్ష: ఉమ్మారెడ్డి

Article

గుంటూరు: సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టింది ధర్మపోరాట దీక్ష కాదని అది దొంగ పోరాట దీక్ష అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే ముఖ్యమన్న చంద్రబాబు మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కలిసి ఏపీని భ్రష్టు పట్టించాయన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఉమ్మారెడ్డి సూచించారు.

Prev కాంగ్రెస్‌ పార్టీ నుండి పోటి చేస్తా: సుమలత
Next ఇంటర్‌ బోర్డు వద్ద ఆందోళన
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.