సీఎం హోదాలో తొలిసారి అసెంబ్లీకి వైఎస్‌ జగన్‌

సీఎం హోదాలో తొలిసారి అసెంబ్లీకి వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ద్వారం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో బుధవారం అడుగుపెట్టారు. అద్వితీయమైన ప్రజాదరణ ఉన్న నేత సభా నాయకుడి స్థానాన్ని అధిష్టించడం రాష్ట్ర చరిత్రలో ఇది మూడోసారి. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సభా నాయకులుగా రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్త చరిత్రను లిఖిస్తూ వైఎస్‌ జగన్‌ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించి ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో సభానాయకుడి స్థానాన్ని అలంకరించారు.

more updates »