ముంబైలో కుప్పకూలిన వంతెన

Article

ముంబయి: ముంబయిలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన సీఎస్టీ రైల్వేస్టేషన్లలోని పాదచారుల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద సుమారు మరికొంత మంది చిక్కుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ వంతెనను రైల్వే స్టేషన్‌ నుంచి అజాద్‌ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు నిర్మించారు. గురువారం సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వంతెన కూలిపోయింది.

Prev నాకు కులం లేదు: పవన్‌కల్యాణ్
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.