రాహుల్‌గాంధీపై కోర్టు ధిక్కరణ పిటిషన్

Article
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేసేందుకు సుప్రీం అంగీకరించింది. రఫెల్ కేసు విచారణలో సుప్రీం తీర్పుపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంపీ ఆరోపించారు. మోదీ రఫెల్ దొంగ అంటూ సుప్రీం చెప్పినట్లు రాహుల్ వ్యాఖ్యానించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను కోర్డు ధిక్కరణగా పరిగణించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ఈ నెల 15న విచారణకు రానుంది.
Prev మొబైల్ గేమ్‌ ప‌బ్‌జిని బ్యాన్ చేసిన నేపాల్ ప్ర‌భుత్వం
Next మద్యం మత్తులో అధికారులు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.