బీజేపీలో చేరిన గాయకుడు దలెర్‌ మెహిందీ

Article
తన గానంతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ గాయకుడు దలెర్‌ మెహిందీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దలెర్‌ మెహిందీ ఇవాళ బీజేపీలో చేరారు. దలెర్‌ మెహిందీకి బీజేపీ వాయువ్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి హన్స్‌రాజ్‌ హన్స్‌, కేంద్రమంత్రి విజయ్‌ గోయల్‌ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ, చాందినీ చౌక్‌ అభ్యర్థి హర్షవర్దన్‌తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు. దలెర్‌ మెహిందీ కూతురు ప్రముఖ సింగర్, బీజేపీ నేత హన్స్‌రాజ్‌ హన్స్‌ కుమారుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Prev ఆర్బీఐకి సుప్రీం వార్నింగ్‌
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.