ధర్మపోరాట దీక్షలో కేజ్రీవాల్‌ స్పీచ్

ధర్మపోరాట దీక్షలో కేజ్రీవాల్‌ స్పీచ్

న్యూఢిల్లీ: సిఎం చంద్రబాబు ఏపికి ప్రత్యేకహోదా కోసం చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ మద్దతు పలికారు. దీక్ష శిబిరానికి వచ్చిన ఆయన సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు మోడి ఒక పార్టీకి కాదు.. యావత్‌ దేశానికి ప్రధాని అన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాని మోదీ హామీలను అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరని కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు.ఏపీ ప్రజల కోసం చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతుగా ఉంటుందని తెలిపారు.

more updates »