ధర్మపోరాట దీక్ష సక్సెస్: సుజనా చౌదరి

ధర్మపోరాట దీక్ష సక్సెస్: సుజనా చౌదరి

ఢిల్లీ:

వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ధర్మపోరాట దీక్ష సక్సెస్ అయ్యిందని ప్రకటించారు కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి. సీఎం చంద్రబాబు, ఇతర నేతలు దీక్ష విరమించిన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడిన సుజనా చౌదరి... కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వం మధ్య పంచాయతీ పొలం గట్టు సమస్య కాదన్నారు. ఈ దీక్షతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని కాదన్న ఎంపీ.. బలం ఉందని హామీలు తుంగలో తొక్కే విధానం ఉండకూడదన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్ పట్ల సానుకూలం ఉన్నాయని తెలిపారు సుజనా చౌదరి. ఇక కాంగ్రెస్ నేతలు ఎక్కువ మంది చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలపడంలో ప్రత్యేకత ఏమీలేదన్నారు.

more updates »