దొంగ ఓట్లు వేసేందుకు పోలింగ్ స్టేషన్ లోకి చొరబడిన దుండగులు

Article
సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లోని కైరానాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. షామ్లీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో కొందరు వ్యక్తులు ఓటర్ కార్డు లేకుండానే ప్రవేశించారు. అనంతరం ఓటు వేసేందుకు ప్రయత్నించారు. వీరిని పోలింగ్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపై దాడికి తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపి ఈ వ్యక్తులను చెదరగొట్టారు. దీంతో నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. మరోవైపు యూపీలోని ఐదు లోక్ సభ నియోజకవర్గాల్లో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నాటికి 41 శాతం పోలింగ్ నమోదయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Prev వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: చంద్రబాబు
Next మద్యం మత్తులో అధికారులు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.