రైల్ నిలయంలో అగ్నిప్రమాదం

Article

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్ కారణంగా సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం భవనం ఏడో అంతస్తులో జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భవనంలోని డ్రాయింగ్‌ సెక్షన్‌లో మంటలు చెలరేగడంతో ముఖ్యమైన ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

ప్రమాద ఘటన సమాచారం అందుకున్న తుకారాంగేట్‌ పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. దట్టమైన పొగలు అంతస్తు అంతటా వ్యాపించడంతో ఒక దశలో వీరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే అనేక అవస్థలు ఎదుర్కొన్న అనంతరం మంటల్ని అదుపు చేయగలిగారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సిఉంది.

Prev చంద్రబాబునాయుడుకి కష్టాలు మొదలయ్యాయా?
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.